Saturday, 7 July 2012

మాయాబజార్ చిత్ర విశేషాలు part1:



దుర్యోదునుడి పుత్రుడు లక్ష్మన కుమారుడుని ఓ వెర్రి వెంగలప్పగా చూపడం భావ్యమేనా అని అప్పట్లో రేలంగి పాత్రను కొందరు విమర్శించారు. దానికి పింగళివారు సమాధానం ఇచ్చారు ఇలా: "లక్ష్మన కుమారుడు ధీరుడు అనో, శూరుడు అనో మహాభారతంలో లేదు. అతనిది పెద్ద పాత్రా కూడా కాదు. భారత యుద్ధం జరిగినపుడు యుద్ధంలో ప్రవేశిస్తూనే అతడు అభిమన్యుడి చేతిలో మరణించాడు. ఆ చిన్న విశయాన్ని తీసుకుని హాస్య పాత్రగా మలచాం. అదేవంత తప్పు కాదు. characterization లో ఔన్నత్యం ఉంటే ఆ ఔన్నత్యాన్ని కాదని ఆ పాత్రని నీచంగా చిత్రీకరిస్తే తప్పు కాని, ఎలాంటి పాత్రతాలేని ఒక పాత్రని తీసుకొని దాన్ని హాస్యానికి వాడుకోవటంలో తప్పు లేదు. అది అనూచిథ్యము కాదు." అని పింగళి వారు వాదించారు.


ఒక ఘట్టంలో బలరాముడి భార్య రేవతికి శశిరేఖ పెళ్లి విశయంలో రుక్మిణి నచ్చజెప్పబోతుంది. అప్పుడామె కసురుకుంటూ నువ్వూ ఒక కూతురిని కనుంటే తెలుసుండేది అంటుంది. అంటే రుక్మిణి కృష్ణలకు పుత్రికా సంతానం లేదని ఆ సందర్భంలో అల వాడుకున్నారన్నమాట. ఇలాంటి ప్రత్యేకతలున్న సంభాషణలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి.


ఇలా ఈ చిత్రానికి కల మరో ప్రత్యేకత ఛాయా గ్రహణ దర్శకుడు మార్కస్ బార్ట్లే గారు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం. ఉదాహరణకు లాహిరి లాహిరి పాట చిత్రీకరణ. అభిమన్యుడు శశిరేఖ, రుక్మిణి కృష్ణుడు, బలరాముడు రేవతి పడవలో విహరిస్తూ పాడుకునే ఆ పాటను ఆయన వేర్వేరు ప్రాంతాలలో తీసారు. మద్రాసు నుంచి మన రాష్ట్రానికి వచ్చే దారిలో ఉన్న ఎన్నురు గ్రామ సరస్సులో కొంత భాగం తీసారు. ఆ తర్వాత వాహిణి స్టూడియో లో పున్నమి వెన్నెల అందాలను సృష్టించారు. తక్కినవన్నీ బ్యాక్ ప్రొడక్షన్ షాట్స్. filters ను ఉపయోగిస్తూ పగటివేల నడిరేయి కిరణాలను ప్రతిభిమ్భిస్తున్నట్టుగా తీయడం ఆయనకే సాధ్యమయింది.  మనం సినిమా చూస్తున్నపుడు పాటను వేర్వేరు చోట్ల తీసినట్టుగాని, పగటి పూట తీసినట్టుగాని ఎంత మాత్రం అనిపించదు. lighting లోను ఎడిటింగ్ లోను చూపిన ప్రతిభ అది. ఇక తాంత్రిక ఛాయాగ్రహణం. ముఖ్యంగా వివాహ భోజనంభు పాట చిత్రీకరణలో చూపిన గమ్మత్తులు తలచుకున్నపుడల్లా మన కళ్ళ ముందు కధలాడుతాయి.



1 comment:

  1. Wow what a detail information about the art piece Maya Bazaar.... chala bagundi swaru. -- from chinna

    ReplyDelete

Any song requests, suggestions and comments are always welcome. Thank you!