Saturday, 7 July 2012

లాహిరి లాహిరి లాహిరిలో !!



లాహిరి లాహిరి లాహిరిలో..
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగేనుగా..  


తారా చంద్రుల విలాసములతో ... విరిసిన వెన్నెల పరవడిలో.. ఉరవడిలో..  
తారా చంద్రుల విలాసములతో ... విరిసిన వెన్నెల పరవడిలో..  
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలు.. 


లాహిరి లాహిరి లాహిరిలో..   



అలల ఊపులో తియ్యని తలపులు..
చెలరేగే ఈ కలకలలో.. మిలమిలలో..
అలల ఊపులో తియ్యని తలపులు.. చెలరేగే ఈ కలకలలో..
మైమరపించే ప్రేమ నవకలో.. హాయిగా చేసే విహరణలో..


లాహిరి లాహిరి లాహిరిలో..   



రసమయ జగమును రాసక్రీడకు..
ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
రసమయ జగమును రాసక్రీడకు..
ఉసిగొలిపే ఈ మధురిమలో.. 
ఎల్లరి మనములు జల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో..



చిత్రం: మాయాబజార్
గానం: ఘంటసాల, లత
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

1 comment:

Any song requests, suggestions and comments are always welcome. Thank you!