Friday, 7 September 2012

Enadu vidiponi mudi vesene


ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమొ పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ సుధల ఆమనిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

సా గామ గమ గామ గమ రీ సారి నిరి సారి నిసని
సాదాదరీ రీదాదపా

మోహాన పారాడువేలి కొనలు నీ మేను కాగా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో నీ చూపు కాగా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతి లో స్వాగతము పాడే ప్రణయము
కలకాలము కలగానమై నిలవాలి మనకోసమై ఈ మమత

ఏనాడు విడిపోని ముడి వేసెనే...

నీ మోవి మౌనాన మదన రాగం మోహాన సాగే మధుపగానం
లేమోవి పూసింది చైత్ర మోదమ్ చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు ఊయలలు వేసే క్షణమిదే
రేపన్నది ఈ పూటనే చేరింది మన జంటకు ముచ్చటగ

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని 

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే




Movie :  Sri kanaka mahalakshmi recording dance troupe
Lyrics :  Veturi
Singer : SP Balu, S.Janaki


My Say:
One of the best compositions of Maestro Ilayaraja, in which the song carries a soothing expression of love.. Janakamma has excelled in presenting the soul of the song through her magical voice.
The same music is used as background score in Swathimuthyam movie which gives a sensible feeling to the viewers... Hatsoff to Ilayaraja for many such great soulful compositions

3 comments:

Any song requests, suggestions and comments are always welcome. Thank you!